: ఛాంపియన్స్ ట్రోఫీ: టీమిండియా విజయలక్ష్యం 265 పరుగులు
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు కొనసాగుతున్న భారత్, బంగ్లాదేశ్ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. టీమిండియా ముందు 265 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ 0, షబ్బిర్ 19, తమీమ్ 70, రహీమ్ 61, షాకిబ్ 15, రియాద్ 21, మోసద్దేక్ 15, మోర్టాజా 30 (నాటౌట్), టాస్కిన్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాకి ఎక్స్‌ట్రాల రూపంలో 22 పరుగులు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జాధవ్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. జడేజాకి ఒక వికెట్ దక్కింది.