: ‘సైకిల్’ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు: టీడీపీపై కేటీఆర్ సెటైర్

‘సైకిల్’ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరచిపోయారని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఐట్ హబ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో వామపక్షాలు అదృశ్యమయ్యాయని అన్నారు. మూడేళ్ల తమ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టామని, ఒంటరి మహిళకు దేశంలోనే తొలిసారిగా పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని, విద్యుత్ ను ఏపీకి దోచిపెట్టిందని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, దీనిపై కేంద్రం స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు.

More Telugu News