: చొరబాటుదారుడని పొరపాటుపడ్డ ఆర్మీ.. కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి!


అరుణాచల్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో చొరబాటుదారుడని భావించి ఓ వ్యక్తిని పొరపాటున భారత భద్రతాదళాలు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సరిహద్దు ప్రాంతం నుంచి ఉల్ఫా, ఎన్ఎస్సీఎన్ కే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతుంటారు. దీంతో, వారిని అడ్డుకునేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో నిన్నరాత్రి నుంచి ఆపరేషన్ కొనసాగుతున్న తరుణంలో తింగ్తు నీము అనే వ్యక్తిపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటనపై ఆర్మీ అధికారులు స్పందిస్తూ, ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో సైన్యం అప్రమత్తమైన సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో, అతన్ని నిలువరించే లోపే అక్కడి నుంచి పరిగెత్తడంతో చొరబాటుదారుడేనని పొరబడి కాల్చాల్సి వచ్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News