: ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న నేటి మ్యాచులో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ 0, షబ్బిర్ 19, తమీమ్ 70 పరుగులకి అవుట్ అయిన విషయం తెలిసిందే. క్రీజులో నిలదొక్కుకుని రాణించిన రహీమ్ 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అనంతరం కొద్దిసేపటికే షాకిబ్ కూడా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రియాద్ 4, మోసద్దేక్ 9 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 38 ఓవర్లకి191/5 పరుగులుగా ఉంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జాధవ్ రెండేసి వికెట్లు తీశాడు. జడేజాకి ఒక వికెట్ దక్కింది.