: మరో ఘనత... మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి-2 చిత్రం ప్రదర్శన
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా ఎన్నో రికార్డులను బద్దలుకొడుతూ దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్, రొమేనియా ఫిలిం ఫెస్టివల్ వంటి ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింశారు. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రారంభ చిత్రంగా ప్రదర్శిస్తున్నారు. బాహుబలి-2 సినిమా ఇప్పటి వరకు 1650 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది.