: మేం రెడీ...మాపై ఒత్తిడి లేదు: బంగ్లా కెప్టెన్
టీమిండియాతో సెమీఫైనల్ లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రాఫే మొర్తజా తెలిపాడు. సెమీస్ కోసం చివరి ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం మొర్తజా మాట్లాడుతూ, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని అన్నాడు. తమతో పోలిస్తే డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ పైనే ఒత్తిడి ఉందని తెలిపాడు. భారత్ పై ఆడేందుకు సమగ్ర ప్రణాళిక ఉందని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సాధన చేశామని, భారత్ ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని చెప్పాడు. బౌలర్లు తమ పని సమర్థవంతంగా నిర్వహిస్తే, బ్యాట్స్ మన్ చేయాల్సింది చేస్తారని తెలిపాడు. టోర్నీలో విజయం సాధించడమే తమ ముందున్న లక్ష్యమని మొర్తజా పేర్కొన్నాడు. తమతో పోలిస్తే టీమిండియా బలంగా ఉందని చెప్పాడు. భారత్ తో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు.