: చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ అత్యవసర భేటీ!
విజయవాడలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రులు గంటా-అయ్యన్నపాత్రుడి మధ్య నెలకొన్న వివాదం, నంద్యాల ఉప ఎన్నికపై చర్చిస్తున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య విశాఖలో నెలకొన్న వివాదం టీడీపీకి తలనొప్పిని తెచ్చిపెట్టింది. భూ కబ్జాలపై అయ్యన్న వ్యాఖ్యలు, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి గంటా లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ప్రతిపక్షానికి ఓ ఆయుధంలా మారింది. ఈ నేపథ్యంలో, ఈ వివాదానికి వీలైనంత త్వరలో ముగింపు పలికేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. మరోవైపు, ఈ మధ్యాహ్నానికల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.