: యువరాజ్ సింగ్ అలాంటి సమాధానం చెబుతాడని మీడియా ఊహించలేదు!


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ 300వ వన్డే పూర్తి చేసుకోనున్నాడు. కెరీర్ లో ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ క్రికెటర్ యువీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు యువరాజ్ సింగ్ ను... సుదీర్ఘ కెరీర్ లో ఏదైనా లోటు వుందా? తీరని కోరిక అంటూ ఏదైనా అలాగే ఉండిపోయిందా?' అంటూ కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించారు.

 దీనిపై స్పందించిన యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, తానింకా బతికే ఉన్నానన్నాడు. ఇంతవరకు తాను బతికి ఉండడమే అన్నింటికన్నా గొప్ప విషయమని తెలిపాడు. దానిని మించినది ఏదీ లేదని చెప్పాడు. అలాంటప్పుడు తీరని కోరికలు అనేవి తనకు చాలా చిన్న విషయాలని, గడిచిపోయిన విషయాలు లేదా అంశాల గురించి ఆలోచించనని యువరాజ్ సింగ్ చెప్పాడు. జట్టులో స్థానం సంపాదించడం కంటే దానిని కాపాడుకోవడం కష్టమని చెప్పాడు. ప్రస్తుతం తన కెరీర్ లో మంచి స్థితిలో ఉన్నానని, ఆనందించడానికి అది చాలని చెప్పాడు. ఇలాంటప్పుడు గడిచిన విషయాలు గుర్తు చేసుకోవడం ఎందుకు? అని ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News