: ఛాంపియన్స్ ట్రోఫీ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గ్రూప్ - ఏలో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లండ్.. గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్‌తో పోల్చితే ఇంగ్లండ్ జట్టు బలంగా కనపడుతోంది. సొంత దేశంలో మ్యాచ్ జరుగుతుండడం ఇంగ్లండ్ జట్టుకు మరో బలం. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. కాగా, రేపు భారత్, బంగ్లాదేశ్ ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. నేటి, రేపటి మ్యాచుల్లో గెలిచిన జట్లు వచ్చే ఆదివారం ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి.