: బనగానపల్లి ఆసుపత్రిలో గర్భంతో కాజల్... దగ్గరుండి స్కానింగ్ చేసిన రానా!: 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ సందడి!
రానా, కాజల్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ కర్నూలు జిల్లా బనగానపల్లిలోని ఆసుపత్రిలో జరుగగా, గర్భం ధరించి ఉన్న కాజల్ కు ఆసుపత్రిలో డాక్టర్ అయిన రానా స్కానింగ్ చేసే దృశ్యాలను చిత్రీకరించారు. గత మూడు రోజులుగా యాగంటి పుణ్యక్షేత్రంలో చిత్రం షూటింగ్ జరుగుతోంది. తమ అభిమాన నటీనటులను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గదికి వెళ్లే మార్గాన్ని ఆసుపత్రి నిర్వాహకులు మూసి వేయడంతో, రోగులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నేటితో యాగంటిలో షూటింగ్ పూర్తవుతుందని ఈ సందర్భంగా యూనిట్ పేర్కొంది.