: కాళ్లు, చేతులు కట్టేసైనా సరే ఆమిర్ మూడోసారి పెళ్లి చేసుకోకుండా చూస్తా: సల్మాన్ ఖాన్ ప్రతిజ్ఞ
ఆమిర్ ఖాన్ కాళ్లు, చేతులు కట్టేసైనా సరే మూడో పెళ్లి చేసుకోకుండా ఉండేలా చూస్తానని సల్మాన్ ఖాన్ ప్రతిజ్ఞ చేశాడు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ, కాళ్లు, చేతులు కట్టేసైనా సరే... సల్మాన్ కి పెళ్లి చేస్తానన్నాడు. దీనిపై ‘ట్యూబ్ లైట్’ సినిమా ప్రచార కార్యక్రమం సందర్భంగా సల్మాన్ ను ప్రశ్నించడంతో... 'ఆమిర్ నా కాళ్లు, చేతులు కట్టేసి పెళ్లి చేస్తే.. నేనూ ఆయన కాళ్లు, చేతులు కట్టేసి మూడో పెళ్లి చేసుకోకుండా చూస్తాను' అన్నాడు నవ్వుతూ.
కాగా, బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా ఉన్న సల్మాన్ కు 51 ఏళ్లు వచ్చేశాయి. సల్మాన్ కోరుకుంటే పెళ్లాడేందుకు ముందుకు వచ్చే హీరోయిన్లు కూడా ఉన్నారు. అయినా సరే సల్మాన్ పెళ్లి మాటెత్తడం లేదు. పోతే, మరో హీరో షారుక్ ఖాన్ గౌరీని ప్రేమ వివాహం చేసుకోగా, ఆమిర్ ఖాన్ మొదట రీనాను, తరువాత కిరణ్ రావ్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సల్మాన్ మాత్రం సింగిల్ గానే ఉండిపోయాడు.