: ముమ్మర ప్రాక్టీస్ లో సహచర క్రికెటర్లు... కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ధోనీ!


రేపు బంగ్లాదేశ్ తో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో విజయమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న వేళ, వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ ధోనీ మాత్రం తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలసి ఎంజాయ్ చేశాడు. జట్టుకు దూరంగా ఫ్యామిలీతో కలసి బయటకు వెళ్లిన ధోనీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత క్రికెట్ టీమ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీటిని షేర్ చేశారు. ఇక సౌతాఫ్రికాతో భారత్ మ్యాచ్ కి ముందు ధోనీ భార్య సాక్షి 'ఫ్యామిలీ టైమ్' అంటూ ఓ ఫొటో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ లో మినహా పెద్దగా రాణించని ధోనీ, సెమీస్ లో సత్తా చూపుతాడని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. రేపు బర్మింగ్ హామ్ లోని ఎడ్ బాస్టన్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ జరగనుండగా, నేడు ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ లో స్థానం కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News