: శిల్పాతో కలసి వచ్చి వైకాపాలో చేరిన ప్రముఖ నేతలు వీరే!


కొంత కాలం క్రితం వరకూ ఉన్న ఫిరాయింపుల పరిస్థితి ఒక్కసారిగా రివర్స్ అయింది. ఇన్నాళ్లూ వైకాపా నుంచి పలువురు తెలుగుదేశం పార్టీలో చేరగా, తొలిసారిగా, ఆ పార్టీకి ఊపునిస్తూ, కర్నూలు జిల్లా ప్రముఖ నేతల్లో ఒకరైన శిల్పా మోహన్ రెడ్డి, తన అనుచరులతో కలసి వచ్చి వైకాపాలో చేరిపోయారు. శిల్పా వైకాపాలో చేరిక కర్నూలు జిల్లా రాజకీయ పరిణామాల్లో కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

శిల్పాతో పాటు నంద్యాల మునిసిపల్ చైర్ పర్సన్ సులోచన, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, నంద్యాల మునిసిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు జగన్ చేతుల మీదుగా వైకాపా కండువాలను కప్పుకున్నారు. వారందరినీ పేరు పేరునా జగన్ కు శిల్పా పరిచయం చేశారు. శిల్పాకు జగన్ కండువా కప్పుతున్న సమయంలో కార్యకర్తలు, 'జగన్ వర్థిల్లాలి', 'వైకాపా వర్థిల్లాలి' అని నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News