: తాతగారింటికి వెళ్లిన రాహుల్ గాంధీ... పుట్టిన రోజు అక్కడే!
నిన్నటి వరకు మధ్యప్రదేశ్ లోని మాండసౌర్ లోని రైతుల ఆందోళనలో పాలుపంచుకునేందుకు వెళ్లేందుకు ఉవ్విళ్లూరిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాతగారింటికి బయల్దేరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన...అమ్మమ్మను చూసేందుకు, ఆమెతో కొన్నిరోజులు గడిపేందుకు వెళ్తున్నట్టు తెలిపారు. అలాగే అమ్మ తరపు కుటుంబసభ్యులను కూడా కలుసుకుని కొద్దిరోజులు గడిపుతానని తెలిపారు. కాగా, ఆయన ఈ నెల 19న 47వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు హడావుడి చేయకుండా ఆయన విదేశాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.