: విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించడం కష్టమేనట!.. తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి... బ్రిటన్ కు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను భారత్ కు తీసుకురావడం అంత ఈజీ కాదని విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ తో మనకు ఉన్న ఒప్పందాల ప్రకారం మాల్యాను మనకు అప్పగించాల్సిందేనని... అయితే, ఇది అంత సులువుగా జరిగే పని కాదని చెప్పారు. అయినా సరే తాము మాత్రం ప్రయత్నాలు ఆపబోమని తెలిపారు. నేరస్తుల అప్పగింతకు నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ ఉండదని... నిరంతర ప్రయత్నాల వల్లే అది సాధ్యమవుతుందని చెప్పారు.