: శిల్పా మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారంతే... జగన్ నాకు అన్యాయం చేయడు!: రాజగోపాల్ రెడ్డి!
నంద్యాల ఉప ఎన్నికలో టికెట్ గొడవ ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయింది. టీడీపీకి గుడ్ బై చెప్పిన శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల వైసీపీ టికెట్ తనదే అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తుండటంతో, వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. నియోజక వర్గంలో వైసీపీని బలోపేతం చేసుకోవడానికి పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అయితే, ఉప ఎన్నికలో టికెట్ తనదే అంటూ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని... టికెట్ ఇస్తానని జగన్ ఆయనకు ఏమైనా చెప్పారా? అని ప్రశ్నించారు. నంద్యాల టికెట్ తనకే అని జగన్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని జగన్ కు కూడా మళ్లీ చెబుతానని అన్నారు. వైయస్ కుటుంబంతో తనకు 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని అన్నారు. నంద్యాల టికెట్ తనదేనని, జగన్ తనకు అన్యాయం చేయరని తెలిపారు. ఒకవేళ టికెట్ తనకు రాకపోతే, అప్పుడు ఆలోచిద్దామని చెప్పారు.