: సహోద్యోగిని కాలుతో తన్నిన ఉద్యోగి...వీడియో చూడండి
కర్ణాటకలోని ప్రభుత్వ కార్యాలయంలో సహాద్యోగిని కాలుతో తన్నిన ఘటనపై బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సింధనూర్ పట్టణ పురపాలక సంఘంలో ఓ ఉద్యోగి తన సహోద్యోగినిపై దారుణంగా ప్రవర్తించాడు. తన సీట్లోంచి లేచి వెళ్లి, ఆమెను కాలితో తన్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కార్యాలయంలోని సీసీ టీవీ పుటేజ్ ను సేకరించారు. ఈ పుటేజ్ లో...మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తమ విభాగంలో పనులు చేసుకుంటుండగా, పురుష ఉద్యోగి తన సీట్లోంచి ఆగ్రహంతో లేచి వెళ్లి, వేరే సీట్లోకి వెళ్లిపోతున్న ఆమెను కాలితో తన్నిన విజువల్స్ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
#CAUGHTONCAM: Sindhanur City Municipal Council employee kicks a woman colleague, in Karnataka's Raichur. Accused arrested, case registered. pic.twitter.com/X2lYckClXI
— ANI (@ANI_news) June 13, 2017