: వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లు టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండే తాను హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరతానని వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన నివాసంలో తన మద్దతుదారులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తనకు టీడీపీలో సముచిత స్థానం లేదని ఆయన తన మద్దతుదారులతో చెప్పారు. నవ నిర్మాణ దీక్షకు తనను దూరంగా పెట్టారంటూ ఆయన టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14న ఆయన తన అనుచరులతో కలిసి వెళ్లి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.