: పాకిస్థాన్ టీమ్‌పై మా ఆయన కమిట్‌మెంట్ సూపర్!: షోయబ్ 250వ మ్యాచ్ గురించి సానియా
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు శ్రీలంక, పాకిస్థాన్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన 250వ వన్డే ఆడుతున్నాడు. ఈ సందర్భంగా షోయబ్ భార్య, ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించి, ఆయనను అభినందించింది. క్రికెట్ పైన, పాకిస్థాన్ టీమ్‌పైన అతని కమిట్‌మెంట్ అద్భుతమని ప్రశంసించింది. షోయబ్ తల్లి, మిగతా కుటుంబ సభ్యులు ఆయనను చూసి ఎంతో గర్విస్తున్నారని చెప్పింది. ఈ రోజు జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాక్ తరఫున ఆడుతున్న షోయబ్ మాలిక్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. తాను చాంపియన్స్ ట్రోఫీలో పాక్, సౌతాఫ్రికా మ్యాచ్‌తోపాటు ఇండియా ఆడే కొన్ని మ్యాచ్‌లు మాత్రమే చూశానని పేర్కొంది.