: విమాన దాడిలో ఐసిస్ చీఫ్ అబూ బకర్ మరణించాడు: సిరియా టెలివిజన్ అధికారిక ప్రకటన
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ లి లెవనెంట్ (ఐఎస్ఐఎస్) నేత అబూ బకర్ అల్ బగ్దాదీ విమాన ప్రమాదంలో మరణించాడని సిరియా ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. రఖ్ఖాపై జరిగిన దాడుల్లో ఆయన మరణించినట్టు తెలిపింది. కాగా, బగ్దాదీ మరణించినట్టు వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. అమెరికా జరిపిన దాడుల్లో మరణించాడని ఓ సారి, ఇరాక్, సిరియా సైన్యం దాడిలో హతుడయ్యాడని మరోసారి గతంలో వార్తలు వచ్చాయి. ఓసారి తీవ్రంగా గాయపడ్డాడని కూడా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇక తాజా ప్రకటనపై ఐఎస్ఐఎస్ స్పందించాల్సి వుంది.