: నభూతో నభవిష్యతి... నాదల్ రికార్డు విజయం!


ఫ్రెంచ్ ఓపెన్ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అద్భుతమైన విజయం సాధించాడు. కెరీర్ లో 15 గ్రాండ్ స్లామ్ టోర్నీలు సాధించిన రఫెల్ నాదల్... క్లే కోర్టులో రారాజు తానేనని మరోసారి నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో స్విట్జర్లాండ్‌ కు చెందిన వావ్రింకాను 6-2, 6-3, 6-1 తేడాతో వరుస సెట్లలో ఓడించి విజయం సాధించాడు. దీంతో పది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించిన ఏకైక టెన్నిస్ ఆటగాడిగా నాదల్ నిలిచాడు. పురుషుల టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు సాధించిన రెండో ఆటగాడిగా నాదల్ నిలిచాడు.

అభిమానులు ముద్దుగా ఫెడెక్స్ అని పిలుచుకునే రోజర్ ఫెదరర్ 18 గ్రాండ్ స్లామ్ లతో అగ్రస్థానంలో నిలవగా, నాదల్ 15 టైటిళ్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. పది ఫ్రెంచ్ ఓపెన్ రికార్డు ఫెదరర్ పేరిట కూడా లేకపోవడంతో నాదల్ రికార్డును అంతా నభూతో నభవిష్యతిగా కీర్తిస్తున్నారు. గాయాల బారినపడి డౌన్ ఫాల్ లో ఉన్న నాదల్ తాజా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తన అంకుల్ లేకపోతే తనకు ఈ విజయం సాధ్యం కాదని పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News