: పార్లమెంటరీ ఎన్నికల్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ పార్టీకి బంపర్ మెజారిటీ.. సంస్కరణలకు ప్రజల ఆమోదం!


పార్లమెంటరీ ఎన్నికల్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ పార్టీ బంపర్ మెజారిటీతో ముందుకు దూసుకెళ్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం  నేటి ఎన్నికల తొలి రౌండ్‌లో మాక్రాన్ ఏడాది ప్రభుత్వం (రిపబ్లిక్ ఆన్ ద మూవ్), భాగస్వామ్య పక్షం మో డెమ్ 32.2-32.9 శాతం ఓట్లు సాధించగా, రైట్-వింగ్ రిపబ్లికన్లు 20.9-21.5 శాతంతో రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నేషనల్ ఫ్రంట్ 13.1-14 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. దీనిని బట్టి చూస్తే మాక్రాన్ 390 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే 577 మంది సభ్యులు కలిగిన నేషనల్ అసెంబ్లీలో 445 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాగా, మాక్రాన్ గత నెల 7న ప్రెంచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఎన్నికైన వారిలో మాక్రాన్ అతి పిన్నవయస్కుడు కావడం గమనార్హం. ప్రతిష్ఠాత్మక సంస్కరణలతో ముందుకెళ్తున్న మాక్రాన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినట్టు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైనట్టు మాక్రాన్ వర్గం చెబుతోంది.

  • Loading...

More Telugu News