: ఈ కాంబినేషన్ ఎంతగా ఆకట్టుకుంటుందో 23న మీరే చెబుతారు!: దిల్ రాజు
ఎస్వీసీసీ బ్యానర్ లో 25వ సినిమాగా దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రూపొందించడం ఆనందంగా ఉందని దిల్ రాజు తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన డీజే ఆడియో వేడుకలో మాట్లాడుతూ, దిల్ సినిమా నుంచి ప్రారంభమైన తన నిర్మాత ప్రయాణం 25 సినిమాలకు చేరుకుందని అన్నారు. ఈ 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందితో పని చేశానని, ఎంతో మంది మంచి మనుషులు పరిచయమయ్యారని చెప్పారు. తమ బ్యానర్ లో 25వ సినిమా మంచి సినిమా కావాలని భావించానని అన్నారు. కెరీర్ ఆరంభంలో వచ్చిన 'పరుగు' సినిమాతో హిట్ అందించిన అల్లు అర్జున్ తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కాంబినేషన్ ఎంతగా ఆకట్టుకుంటుందో 23న సినిమా చూసి బయటకు వచ్చిన మీరే చెబుతారని దిల్ రాజు చెప్పారు. చివరిగా చెబుతూ, 'సినిమా సూపర్ హిట్' అన్నారు.