: మురికివాడలపై సల్మాన్ దయ... సొంత డబ్బులతో 3000 సౌచాలయాలు బాగుచేయించాడు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రెండు రోజుల క్రితం ముంబైలోని ఆర్ఏ కాలనీలో కలియదిరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తల్లి ఒడిలో వున్న ఒక చిన్నపిల్లాడిని కాసేపు ఆడించి ముద్దు కూడా చేశాడు. ఆ రోజు సల్మాన్ పర్యటించిన ప్రాంతంలో నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారిన 3000 టాయ్ లెట్స్ ను సొంత ఖర్చులతో బాగు చేయించి, నీటి సౌకర్యం కల్పించి, తిరిగి వినియోగం లోకి తెచ్చాడు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో టాయ్ లెట్స్ (సౌచాలయాలు) లేని ఇళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కొత్తవి నిర్మించి ఇస్తానని తెలిపాడు. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ నుంచి సల్మాన్ ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాడు.