: సఫారీలకు షాక్... డివిలీర్స్, మిల్లర్ అవుట్


సౌతాఫ్రికాకు టీమిండియా ఫీల్డింగ్ దెబ్బ తెలిసొచ్చింది. సింగిల్స్ తీయడంలో సిద్ధహస్తులుగా పేరుగాంచిన జట్లలో సఫారీ జట్టు ఒకటి. టీమిండియా లైన్ అండ్ లెంగ్త్ బంతులను ఎదుర్కొంటూ సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఓపెనర్లు ఆమ్లా (35), డికాక్ (53) శుభారంభం ఇవ్వడంతో సౌతాఫ్రికా ఆకట్టుకుంది. టూ డౌన్ లో డివిలీర్స్ వచ్చాడు. నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన డివిలీర్స్ (16) హార్డిక్ పాండ్య విసిరిన అద్భుతమైన త్రోకు అవుటయ్యాడు.

అనంతరం అశ్విన్ వేసిన బంతిని థర్డ్ మన్ దిశగా డుప్లెసిస్ కొట్టాడు. వేగంగా కదిలిన ఫీల్డర్ బంతిని అందుకోవడంతో సగం పిచ్ లోకి దూసుకొచ్చిన డుప్లెసిస్ వెనుదిరిగాడు. అప్పటికే సగం పిచ్ లోకొచ్చిన మిల్లర్ కూడా ముందుకు పరుగెత్తాడు. ఇద్దరూ ఒక వైపు పరుగెత్తడంతో కేదార్ జాదవ్ బంతిని అందుకుని వికెట్లను గిరాటేశాడు. దీంతో డేవిడ్ మిల్లర్ (1) అవుటయ్యాడు. దీంతో క్రీజులో డుప్లెసిస్ (36), జేపీ డుమిని (4) ఉన్నారు. 33 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News