: టర్కీలో దోపిడీకి గురైన బాలీవుడ్ నటి
బాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో దోపిడీకి గురైంది. 'భాబీజీ ఘర్ పర్ హై' టీవీ సీరియల్ నటి సౌమ్యా టాండన్ స్నేహితులతో కలిసి ఇస్తాంబుల్ కు విహార యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో బయటకు వెళ్లాల్సి రావడంతో క్యాబ్ ఎక్కింది. ఆమెతో క్యాబ్ డ్రైవర్ అమర్యాదగా ప్రవర్తించాడు. అంతే కాకుండా దారి మధ్యలోనే క్యాబ్ ను ఆపేసి డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. మీటర్ ఎందుకు వేయలేదని ఆమె అడగడంతో వాగ్వాదానికి దిగాడు.
తర్వాత, అతనితో అనవసరంగా గొడవ ఎందుకు? అని భావించిన ఆమె మూడు యూరోలు తీసి ఇవ్వగా, ఆ కరెన్సీ తమది కాదని చెబుతూ మళ్లీ గొడవకు దిగాడు. అంతే కాకుండా ఆమె ఒక్కతే ఉండడంతో ధైర్యంగా ఆమె పర్సులోని 800 యూరోలు (60,000 రూపాయలు) తీసుకుని పరారయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా క్యాబ్ రసీదు లేకపోవడంతో ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక ఆమె ఇస్తాంబుల్ కార్డ్ కు దరఖాస్తు చేసుకుని ట్రామ్ లలో ప్రయాణిస్తున్నట్టు తెలిపింది.