: చిన్నారుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ‘బ్యాట్‌మన్’ మృతి


1960లలో ప్రసారమైన టీవీ సిరీస్‌లో బ్యాట్‌మన్‌గా నటించి సంచలన విజయాన్ని అందుకుని, చిన్నారుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆడమ్ వెస్ట్ (88) కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తన నటనతో చిన్నారులకు సూపర్‌ హీరోగా మారిన వెస్ట్ పెద్దలకు బోల్డంత వినోదం పంచిపెట్టారు. ఆయన నటించిన బ్యాట్‌మన్ మూడు సీజన్లలో ప్రసారమైంది.

అటువంటి పాత్ర పోషించడం చాలా భయంకరమైన సవాలుతో కూడుకున్న పని అని ఆడమ్ 2014లో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఆ పాత్ర తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అది ‘ఐకానిక్’గా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మృతికి హాలీవుడ్ సంతాపం తెలిపింది.

  • Loading...

More Telugu News