: భారత్‌కు బుద్ధి చెప్పండి.. సైన్యానికి సూచించిన పాక్ ఆర్మీ చీఫ్!


నియంత్రణ రేఖ వెంబడి భారత్ కాల్పులకు దిగితే దీటుగా బదులివ్వాలని  పాక్ సైన్యానికి ఆ దేశ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా సూచించారు. భారత్ కాల్పులు జరిపితే చూస్తూ కూర్చోవద్దని, గట్టిగా తిప్పి కొట్టాలని అన్నారు. ఎల్‌వోసీ వెంబడి మోహరించిన దళాలను సందర్శించిన ఆయన తమ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘన, పాక్ దళాల స్పందనపై ఆయన మాట్లాడుతూ సైన్యానికి ధైర్యం నూరిపోశారు. కశ్మీర్‌పై బజ్వా మరోమారు నోరు పారేసుకున్నారు. కశ్మీరీలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు. కశ్మీరీలకు తమ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News