: హలెప్ కు షాక్... మట్టి కోటకు కొత్త రారాణి వోస్టాపెంకో


ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ పోటీల్లో మూడో సీడ్ హలెప్ కు షాక్ తగిలింది. రాత్రి జరిగిన ఫైనల్స్ లో అన్ సీడెడ్ క్రీడాకారిణి జెలెనా వోస్టాపెంకో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ లో హలెప్ ను ఓడించి, మట్టి కోటకు కొత్త రారాణిగా చరిత్ర సృష్టించింది. సుమారు రెండున్నర గంటలు సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 6-4 తేడాతో హలెప్ గెలుచుకున్నప్పటికీ, ఆపై అదే స్థాయి ఆటతీరును ఆమె ప్రదర్శించలేక పోయింది.

రెండో సెట్ ను 6.4 తేడాతో సొంతం చేసుకున్న ఒస్టాపెంకో, నిర్ణయాత్మకమైన మూడవ సెట్ ను 6-3 తేడాతో నెగ్గి చాంపియన్ గా నిలిచింది. ఒస్టాపెంకో కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ట్రోఫీ కావడం గమనార్హం. కాగా, నేటి సాయంత్రం 6 గంటలకు పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు వావ్రింకా, నాదల్ మధ్య జరగనుంది.

  • Loading...

More Telugu News