: ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్ విజయ లక్ష్యం 278 పరుగులు
ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో వార్నర్ 21, ఫించ్ 68, స్మిత్ 56, మోయిసెస్ 17, మ్యాక్స్ వెల్ 20, వేడ్ 2, స్టార్క్ 0, కమ్మిన్స్ 4, జాంపా 0, హెచ్.వుడ్ 1 (నాటౌట్), హెడ్ 71 (నాటౌట్) పరుగులు చేశారు. ఆస్ట్రేలియాకు ఎక్స్‌ట్రాల రూపంలో 17 పరుగులు లభించాయి. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్, రషీద్‌లు నాలుగేసి వికెట్లు తీశారు. స్టోక్స్‌కి ఒక వికెట్ దక్కింది.