: పాల్వాయి అంత్యక్రియలకు భారీగా హాజరైన నేతలు, కార్యకర్తలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) నిన్న గుండెపోటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. పాల్వాయిని కడసారి చూసేందుకు భారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఆయన అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు కూడా హాజరయ్యారు.