: రేపటి నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇటీవల రైతులు ఆందోళన తెలిపిన నేపథ్యంలో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి మంద్‌సౌర్‌లో కర్ఫ్యూ కూడా విధించాల్సి వచ్చింది. వచ్చే ఏడాదే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పెద్ద చిక్కే వచ్చిపడింది.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకు రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటన చేశారు. భోపాల్‌లోని దసరా మైదానంలో తన దీక్షను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై ఆ మైదానంలోనే తనతో చర్చించవచ్చని చెప్పారు.