: నేను కనిపించే ఆ వీడియోల కోసం ఎదురుచూస్తున్నా: 'సుచీ లీక్స్'పై అమలాపాల్ వెటకారం


కొంతకాలం క్రితం దక్షిణాది చిత్ర పరిశ్రమలో గాయని సుచిత్ర పెట్టిన ఎన్నో ట్వీట్స్ తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. సుచీ లీక్స్ పేరిట పలువురు హీరో హీరోయిన్ల ప్రైవేటు ఫోటోలను పబ్లిక్ చేసిన ఆమె, హీరో ధనుష్, హీరోయిన్ అమలాపాల్ ల శృంగార దృశ్యాలు ఉన్నాయని, ఓ సండే పూట వాటిని విడుదల చేస్తానని సుచిత్ర ప్రకటించింది కూడా. తాజాగా, ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న అమలాపాల్ ను ఇదే విషయమై ప్రశ్నించగా, తాను కనిపించే ఆ వీడియోల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని వెటకారంగా చెప్పింది. తాను చాలా ఆదివారాలు ఎదురు చూశానని, ప్రతి ఆదివారమూ తనకు నిరాశ కలుగుతూనే ఉందని అంది. ఆ శృంగార వీడియోలు ఎప్పుడు బయటకు వస్తాయో మీడియానైనా చెప్పాలని అడిగింది అమలాపాల్.

  • Loading...

More Telugu News