: రాంచరణ్, సమంతల కొత్త సినిమాకు పేరు పెట్టేశారు... చూడండి!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'రంగస్థలం 1985' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు పేరును జత చేసి తయారు చేసిన పోస్టరును పోస్ట్ చేశారు. ఆ వెంటనే భారత్ లో అత్యంత వేగంగా ట్రెండింగ్ అవుతున్న పదాల్లో ఒకటిగా రంగస్థలం నిలిచిపోయింది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Mega Powerstar Ram Charan & Sukumar's #Rangasthalam1985 will be released for Sankaranthi 2018. pic.twitter.com/cQuxc2fdS5
— Vamsi Kaka (@vamsikaka) June 9, 2017