: ఏపీలో కులవివాదాలు తప్ప నేరాలు పెద్దగా ఉండవు: డీజీపీ సాంబశివరావు


ఏపీలో కులవివాదాలు తప్ప నేరాలు పెద్దగా ఉండవని డీజీపీ సాంబశివరావు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, కేసుల వివరాలు, అందుకు సంబంధించిన వీడియోలను అనుసంధానం చేస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిన్న జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News