: విశాఖలో ఆక్రమణలు పెరిగిన మాట వాస్తవమే.. విజయసాయిరెడ్డి అవినీతి చిత్రగుప్తుడు: ఏపీ మంత్రులు
విశాఖపట్టణంలో భూముల ధరలు పెరగడంతో ఆక్రమణలు పెరిగిన మాట వాస్తవమేనని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, ఈ విషయమై ఈ నెల 15న బహిరంగ విచారణ చేపడతామని పేర్కొన్నారు. భూ కుంభకోణాలపై వైఎస్సార్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు.
కాగా, మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి అవినీతి చిత్రగుప్తుడని ఆరోపించారు. విశాఖపట్టణంలో భూ కబ్జా అంశంపై వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదమని అన్నారు. మంత్రి లోకేష్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉంటే ఇరవై నాలుగు గంటల్లోగా నిరూపించాలని వైఎస్సార్సీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు.