: సైనా నెహ్వాల్ పాత్ర కోసం బ్యాట్ పట్టిన శ్రద్ధాకపూర్!


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అమోల్ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సైనా పాత్రను ప్రముఖ నటి శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రద్ధాకపూర్ బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. సైనా పాత్రను తెరపై రక్తి కట్టించే నిమిత్తం ఈ శిక్షణలో మునిగిపోయింది. ప్రకాష్ పదుకొణె అకాడమీకి చెందిన ఓ సీనియర్ కోచ్ ఆధ్వర్యంలో శ్రద్ధాకపూర్ శిక్షణ పొందుతోంది. కాగా, శ్రద్ధాకపూర్ తన స్కూల్ డేస్ నుంచి ఆటలపై ఆసక్తి కనబర్చేది. ముఖ్యంగా ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటన్ ఆడుతుండేది.

  • Loading...

More Telugu News