: బుల్లి తెరపై నిరాశ పరిచిన చిరంజీవి 150వ చిత్రం!
మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత నటించిన 'ఖైదీ నంబర్ 150' ఘన విజయాన్ని సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, బుల్లి తెరపై మాత్రం ఈ సినిమా నిరాశపరిచింది. ఓ చానల్ లో ప్రసారమైన ఈ సినిమా కనీసం రెండంకెల టీఆర్పీ రేటింగ్ ను కూడా సాధించలేకపోయింది. మహేష్ బాబు నటించిన అట్టర్ ఫ్లాప్ సినిమా 'బ్రహ్మోత్సవం' సైతం 7.52 రేటింగ్ ను సాధించింది. చిరు సినిమాకు కేవలం 6.9 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే మరో ఛానల్ లో అదే సమయానికి ఓ సినీ వేడుక ప్రసారం కావడంతో ఈ సినిమాకు రేటింగ్ తగ్గిందని కొందరు చెబుతున్నారు.