: కేరళలోని మూకాంబికా ఆలయంలో ‘దేవసేన’


‘బాహుబలి’లో దేవసేన పాత్రధారి అనుష్క తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని కొల్లూరులో ఉన్న మూకాంబికా ఆలయాన్ని ఈ రోజు సందర్శించింది. ‘బాహుబలి’ చిత్రం అద్భుత విజయం సాధించడంతో తన మొక్కులు తీర్చుకునే నిమిత్తం అనుష్క ఇక్కడికి వచ్చినట్టు సమాచారం. కాగా, అంతకుముందు, పుత్తూరుకు సమీపంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయాన్ని అనుష్క సందర్శించింది. అక్కడి నుంచి నేరుగా మూకాంబికా ఆలయానికి అనుష్క కుటుంబం వచ్చినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితం అనుష్క పలక్కాడ్ లోని ఆయుర్వేద దుకాణానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘భాగ్ మతి’ చిత్రంలో తన సహనటుడు ఉన్నీ ముకుందన్ తో కలిసి ఆమె ఇక్కడికి వెళ్లింది. ఈ ఆయుర్వేద దుకాణం నిర్వాహకుడు అన్షద్ అలీ, ఉన్నీ ముకుందన్ కు మిత్రుడు.

  • Loading...

More Telugu News