: భారత్, శ్రీలంక మ్యాచ్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఈ రోజు శ్రీలంకతో తలపడుతోంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన కపుగెదెర స్థానంలో ఈ రోజు దనుష్క గుణతిలక ఆడనున్నాడు.
ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక కంటే ఎంతో బలంగా కనిపిస్తుండడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.