: ఏంటిది?...భూమి కనిపిస్తే డేగల్లా వాలిపోతున్నారు?: బొత్స


విశాఖపట్టణంలో భూకుంభకోణాలపై వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అధికారపార్టీ నేతలే భూకబ్జాలకు పాల్పడడం దారుణమని అన్నారు. ఇందుకోసం ఏకంగా రికార్డులనే ట్యాంపరింగ్ చేయడం బరితెగింపేనని చెప్పారు. విలువల్లేని రాజకీయాలతో అధికారపార్టీ నేతలు దిగజారిపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధానం సరైనది కాదని ఆయన తెలిపారు. వైజాగ్ శివార్లలో భూమి కనిపిస్తే చాలు ... డేగల్లా వాలిపోతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో దౌర్జన్యాలు, గూండాయిజాలకు పాల్పడిన కబ్జారాయుళ్లు...ఇప్పుడు ఏకంగా రికార్డులను తారుమారు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాలకు ఎకరాలను మింగేసి ఏమీ ఎరగనట్టు మౌనంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News