: మిత్ర దేశం దక్షిణ కొరియా నుంచి అమెరికాకు షాక్!


వ‌రుస‌గా అణ్వాయుధాల ప‌రీక్ష‌ల‌ను జరుపుతూ అమెరికాకు ఉత్త‌ర‌కొరియా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు అమెరికాకు ద‌క్షిణ‌కొరియా మంచి మిత్ర దేశంగా ఉంది. అయితే, తాజాగా అమెరికాకు ద‌క్షిణ కొరియా కూడా షాక్ ఇచ్చింది. ఉత్తర కొరియా క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు అమెరికాతో క‌లిసి ఏర్పాటు చేస్తోన్న థాడ్‌ (టర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌) వ్యవస్థను నిలిపివేయాలని ద‌క్షిణ కొరియా నిర్ణయించింది. ప్రకృతిపై థాడ్‌ చూపే దుష్పరిణామాలను తాము అధ్యయనం చేసిన తర్వాతే తిరిగి అనుమతి ఇస్తామ‌ని చెప్పింది.

తమ దేశంలోకి వచ్చిన నాలుగు థాడ్‌ వ్యవస్థలు ప్రస్తుతానికి విధులు చేపట్టవని దక్షిణకొరియా స్పష్టం చేసింది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా మూన్‌ జె ఇన్ ఇటీవ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న‌ ఈ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, దీనికయ్యే వ్యయాన్ని దక్షిణ కొరియా చెల్లించాలని ట్రంప్ కొన్ని రోజుల ముందు పేర్కొన్నారు.         

  • Loading...

More Telugu News