: జేసీ బ్రదర్స్ అండతోనే భూకబ్జాలు: వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి


జేసీ సోదరుల అండతోనే వారి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని తాడిపత్రి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సీబీఐ దాడులు జరగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని... మరి, దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. నారాయణరెడ్డికి ఓ న్యాయం, దీపక్ రెడ్డికి మరో న్యాయమా? అని అడిగారు. దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. భూకబ్జా కేసులో అరెస్టైన దీపక్ రెడ్డిని సిట్ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News