: పైలట్ల వాట్సాఫ్ గ్రూప్ లో అశ్లీల సందేశాలు.. మండిపడుతున్న డీజీసీఏ!


పైలట్ల వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల మెస్సెజ్ లు ఉండటంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన యాన సంస్థలకు చెందిన 34 మంది పైలట్ల వాట్సాప్ గ్రూప్ లో ఈ అశ్లీల సందేశాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో 13 మంది విమాన పైలట్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా డీజీసీఏ డైరెక్టరు జనరల్ బీఎస్ భుల్లార్ మాట్లాడుతూ, ఈ విషయమై చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే, పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా విమానయాన సంస్థలకే వదిలిపెడుతున్నామని చెప్పారు. ‘ఇండిగో’ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఈ విషయమై అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా తనకు వచ్చిన ఓ మెసేజ్ ను తన మిత్రులకు, సహచరులకు ఒక పైలట్ ఫార్వర్డ్ ను చేసిన విషయాన్ని స్పైస్ జెట్ అధికార ప్రతనిధి ప్రస్తావించడం గమనార్హం.

  • Loading...

More Telugu News