: అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలకు తాత్కాలిక ఊరట!


బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతిలకు సీబీఐ కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి వీరికి మినహాయింపును ఇచ్చింది కోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇటీవలే వీరు ముగ్గురితో పాటు మరికొందరు నిందితులు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి తమను మినహాయించాలని వీరు కోర్టుకు విన్నవించారు. కానీ, వీరి విన్నపాన్ని కోర్టు అప్పుడు తిరస్కరించింది. తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు కోర్టు తెలపడంతో, వీరికి ఊరట లభించినట్టైంది.

  • Loading...

More Telugu News