: ఎస్.సీ.ఓ. సదస్సు నేపథ్యంలో... చైనా అధ్యక్షుడితో మోదీ సమావేశం!
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఈ వారంలో భేటీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 8, 9 తేదీల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్ సీఓ) సదస్సు కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా మోదీ, షి జిన్ పింగ్ ల మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు దౌత్యవర్గాలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కాగా, గత నెలలో చైనా నిర్వహించిన సదస్సుకు భారత్ గైర్హాజరైంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ఎస్సీఓ గురించి చెప్పాలంటే.. ఇందులో చైనా, కజక్ స్థాన్, కిర్గిజ్ స్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, రష్యాలకు మాత్రమే పూర్తి స్థాయి సభ్యత్వం ఉంది. ఈ వారంలో జరగనున్న సదస్సులో భారత్ తో పాటు పాకిస్థాన్ కూ ఎస్సీఓలో సభ్యత్వం కల్పించనున్నారు.