: వర్షపు నీరు చేరిన... ఏపీ సచివాలయం నాలుగో బ్లాక్ ను పరిశీలించిన సీఆర్డీఏ కమిషనర్


వర్షపు నీరు చేరిన ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాకును సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదో బ్లాకులో సన్ రూఫ్ నుంచి జల్లు కొట్టడం వల్ల నీరు భవనంలోకి వచ్చిందని, సన్ రూఫ్ ను కిందికి దించుతామని చెప్పారు. కొన్నిచోట్ల కిటికీలు సరిగా మూయకపోవడంతో వర్షపు నీరు నాలుగో బ్లాకులోకి వచ్చిందని, ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీరు రావడంపై చీఫ్ ఇంజనీర్ పరిశీలించారని చెప్పారు. కాగా, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు చేరింది.

  • Loading...

More Telugu News