: రాబోయే రోజుల్లో ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి!: శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

రాబోయే రోజుల్లో ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో నవనిర్మాణదీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలో 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తయారీలో ఏపీ మొదటి స్థానంలో ఉందని అన్నారు. నిరుద్యోగ భృతి చెల్లింపు కోసం త్వరలోనే ఓ పాలసీ తీసుకొస్తున్నామని, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఆరింటిని అభివృద్ధి చేయాలని సంకల్పించామని చెప్పారు. హెచ్సీఎల్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు శివనాడార్ ముందుకొచ్చారని, తద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

More Telugu News