: గోపీచంద్ సినిమాను చుట్టుముట్టిన వివాదం!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. చివరికి ఆ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ బ్రాహ్మణ సంఘాల డిమాండుకు ఒప్పుకోవడంతో ఆ వివాదంపై కాస్త వేడి తగ్గింది. అయితే, గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ ఈ నెల 9న విడుదలకు సిద్ధం అవుతుండగా ఆ సినిమాను కూడా వివాదం చుట్టుముట్టింది. ఈ చిత్రం కోసం తన వద్ద నిర్మాత సి.కల్యాణ్ రూ.6 కోట్లు తీసుకుని, మోసం చేశారని సహదేవ్ అనే ఓ ఎన్నారై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.