: ఆఫ్ఘనిస్థాన్ లో మరో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి.. 16 మందికి గాయాలు
ఆప్ఘనిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం ఓ మసీదు వద్ద సంభవించిన ఈ పేలుడు ధాటికి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుడుపై అక్కడి అధికారులు మాట్లాడుతూ... మసీదు గేటు వద్ద ఓ మోటారు సైకిల్‌లో దుండగులు బాంబు అమర్చారని, అక్కడ ఓ కార్యక్రమం జరుగుతుండగా ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఇటీవల ఆప్ఘనిస్థాన్‌లో రోజుల వ్యవధిలోనే పలుసార్లు బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. తమ దేశంలో ప్రతి రోజు ఎక్కోడచోట దాడులు జరుగుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.